Monday, 20 October 2025

ఇప్పటి తెలుగు సినిమాలు

 ఇప్పటి తెలుగు సినిమాలు  

మీరు మంచి, ఒక మోస్తరు తెలుగు సినిమాలు చూసి చూసి విసిగిపోయారా? మీకొక శుభవార్త. జీవితం లో ఇంత వరకు చూడని ఒక చెత్త సినిమాని పవన్ కళ్యాణ్ గారు దాదాపు రెండు నెలల క్రితమే అందించారు. 300 కోట్లు వెచ్చించి సినిమా తీసి 87/117 కోట్లు (భారత/ప్రపంచ) వసూలు చేసి రికార్డు సృష్టించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సహకరించక పోయి ఉంటే ఇంకో ఏభై కోట్లు తగ్గి ఉండేవి. ఇప్పుడు ఓటీటీ లో దొరుకుతుంది. చూసి తరించండి. 

 ఓటీటీ లో వెబ్ సీరీస్ చూసేవారికి హెచ్చరిక. “రానా నాయుడు” అనే పేరుతో వచ్చిన వెబ్సీరీస్ చూసి తట్టుకునే శక్తి కలవారు చూడవచ్చు. చిన్నవయసులో ఛండాలమైన బూతులు మాట్లాడుతుంటే విననివారు ఈ డ్రామా చూస్తే షాక్ కి గురౌతారు. పూర్తిగా సీరీస్ చూసేస్తే ఇంక వినవలసిన బూతులు ఏవీ ఉండవు. బూతుల పంచాంగ కర్తలై పోవచ్చు. థీసీస్ సబ్మిట్ చేసి పిహెచ్డీ కూడా పొందవచ్చు.